డబ్బు లేనందుకే వెనుకబడ్డాం | Congress Leader Jagga Reddy Speaks About Municipal Election Results | Sakshi
Sakshi News home page

డబ్బు లేనందుకే వెనుకబడ్డాం

Jan 27 2020 3:46 AM | Updated on Jan 27 2020 3:46 AM

Congress Leader Jagga Reddy Speaks About Municipal Election Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని, అధికార పార్టీపై కాంగ్రెస్‌ కేడర్‌ చిత్తశుద్ధితో పోరాటం చేసిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎప్పుడైనా గెలుపు అవకాశాలుంటాయని, అంగబలం, అర్థంతో గెలిచిన టీఆర్‌ఎస్‌ గెలుపు పెద్ద గొప్ప కాదని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచినంతమాత్రాన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాదరణ లేదనుకుంటే పొరపాటేనని, కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా, ఓడినా హీరోనేనని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ డబ్బు ప్రభావంతో గెలిచిందని, తమ దగ్గర డబ్బు లేదు కాబట్టే ఈ ఎన్నికల్లో వెనుకబడ్డామని తెలిపారు. కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డిలో పాగా వేసినందుకు మంత్రి హరీశ్‌రావును, రాష్ట్ర వ్యాప్తంగా 100 స్థానాల్లో గెలిచినందుకు మంత్రి కేటీఆర్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement