దీదీ దూరమౌతుందా? | Congress And Trinamool Congress Not Tie Up | Sakshi
Sakshi News home page

దీదీ దూరమౌతుందా?

Apr 30 2018 8:35 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress And Trinamool Congress Not Tie Up - Sakshi

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పాంత్రీయ పార్టీలతో సానిహిత్యం పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తృణమూల్‌ వేర్వేరుగా పోటి చేస్తున్నాయి. తృణమూల్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ మొదటి నుంచి ప్రయత్నించినా మమత బెనర్జీ మాత్రం కాంగ్రెస్‌ను దూరంగా ఉంచారు. జాతీయ స్థాయిలో మోదీని ఓడించేందుకు లౌకిక శక్తులన్ని ఏకం కావాలని మమత  పిలిపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలతో​ సానిహిత్యంగా మెలుగుతున్న మమత కాంగ్రెస్‌కు మాత్రం మొదటి నుంచి కొంత దూరంగా ఉంటున్నారు.
 
ఇటివల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుకు మమత సిద్ధంగాలేరని, పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత పొత్తుల గురించి ఆలోచిస్తామని టీఎంసీ సీనియర్‌ నేత తెలిపారు. మమత  మొదటి నుంచి బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నోట్ల రద్దు, జీఎస్‌టీ, వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని  ఓడించేందుకు మమత తీవ్ర స్థాయిలో కృషిచేస్తున్నారు. ఢిల్లీలో ఇటివల సోనియా గాంధీ  విపక్ష పార్టీ నేతలకు ఇచ్చిన విందుకు మమత హాజరు కాలేదు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఇచ్చిన విందుకు మాత్రం మమత  హాజరై సంఘీభావం తెలిపిన విషయం విధితమే. కాగా 2016లో బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌- లెఫ్ట్‌ జతకట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement