కన్నడ ప్రజలకు ధన్యవాదాలు : రమణ్‌సింగ్‌ | Chhattisgarh CM Raman Singh Thanked Karnataka People | Sakshi
Sakshi News home page

కన్నడ ప్రజలకు ధన్యవాదాలు : రమణ్‌సింగ్‌

May 15 2018 11:24 AM | Updated on May 15 2018 12:18 PM

Chhattisgarh CM Raman Singh Thanked Karnataka People - Sakshi

ఛత్తీడ్‌ఘడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, బెంగళూరు : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తోన్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి బీజేపీ పూర్తి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఛత్తీడ్‌ఘడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ కర్ణాటక  ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి పట్టి కట్టిన కన్నడిగులు చారిత్రాత్మక విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి తెరపడిందని, వారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.
కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 112 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement