యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు | Chandrababu Naidu Violate Model Code of Conduct | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు

Mar 14 2019 11:40 AM | Updated on Mar 14 2019 12:09 PM

Chandrababu Naidu Violate Model Code of Conduct - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ.. టీడీపీ నేతలు దానితో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అమరావతిలోని ప్రజవేదికలో చంద్రబాబు టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదికలో సొంత పార్టీ చేరికల కార్యాక్రమాన్ని బాబు చేపట్టారు. అంతేకాకుండా పసుపు కండువాలతో ప్రజావేదికలో సమీక్షలు కూడా జరుపుతున్నారు. ప్రతిపక్షాలను విమర్శిస్తు రాజకీయ ప్రెస్‌ మీట్లను కూడా అక్కడి నుంచే చేపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడంపైనా పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కింది స్థాయి నేతలు కూడా పార్టీ అధినేత బాటలోనే ఎన్నికల కోడ్‌ ఉంటే మాకేంటి అన్నట్టు ముందుకు సాగుతున్నారు.

రాజధాని రైతుల భూముల్లో టీడీపీ కార్యక్రమాలు..
టీడీపీ తమ అవసరాల కోసం రాజధాని రైతుల భూములను వాడుకుంటుంది. రైతుల భూముల్లో యథేచ్ఛగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అమరావతిలో పార్టీ నేతల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా రాజధాని రైతల భూములను వినియోగించుకోవడానికి తయారైంది. సీఆర్‌డీఏ ఆధినంలో ఉన్న భూముల్లో టీడీపీ టెంపరరీ కార్యాలయం ఏర్పాటు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement