సీపీఎస్‌ రద్దు ఉద్యమానికి మద్దతు: చాడ

Chada venkat reddy on cps  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాలకు మద్దతు తెలుపుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 1,17,872 మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైందన్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్ర ఆర్థిక సంస్థ పీఎఫ్‌డీఆర్‌ఏ..   కొత్త పెన్షన్‌లో ఉంటారా? పాత పెన్షన్‌ అమలు చేస్తారా? అని అడిగితే సీఎం కేసీఆర్‌ కొత్త పెన్షన్‌ స్కీం  కొనసాగిస్తూ జీవో 28 ఇచ్చారని మండిపడ్డారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top