‘ప్రగతి’ ప్రచారమే.. నివేదన ఎక్కడ: చాడ

Chada venkat reddy commented over kcr - Sakshi

హుస్నాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ ప్రచారమే తప్ప.. ఎలాంటి నివేదన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదన సభకోసం అధికార దుర్వి నియోగానికి పాల్పడి అడ్డగోలుగా ఖర్చు చేసిందని ఆరోపించారు.

కేబినెట్‌లో అనేక వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్, త్వరలోనే అసెంబ్లీ రద్దుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వరాలను ఎలా అమలు చేస్తా రని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇదివరకు ఇచ్చిన హమీలనే నేరవేర్చలేదని, ఉత్తి మాటలే తప్ప చేతలు లేవని ఆరోపించారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు, మైండ్‌గేమ్, అప్పులు, మద్యం ఏరులుగా పారించడం, అవినీతి తప్ప.. అభివృద్ధి సాధించలేదని విమర్శించారు. రాష్ట్రం లో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ నత్తనడకన సాగుతోందన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top