‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’ | BJP State President Lakshman Comments Cancellation Of Article 370 | Sakshi
Sakshi News home page

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

Aug 6 2019 2:41 PM | Updated on Aug 6 2019 2:42 PM

BJP State President Lakshman Comments Cancellation Of Article 370  - Sakshi

సాక్షి, నల్గొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అంతా సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ స్వీకరణకు ఆదరణ భారీగా పెరిగిపోతుందని, నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరించేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ​

కశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆగష్టు 5వ తేది చరిత్ర తిరగరాసిన రోజని, ఇది దేశ సమగ్రతకు నిదర్శమని అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ సమగ్ర అభివృద్దికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలిస్తాయన్నారు.విపక్షాల వ్యాఖ్యలను ప్రజలు క్షమించబోరని, వారికి దేశ సమస్యలు పట్టబం లేదని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement