అంజూ జార్జ్‌ యూటర్న్‌పై బీజేపీ ఫైర్‌ | BJP Slammed Anju George For Reportedly Changing Her Stand | Sakshi
Sakshi News home page

అంజూ జార్జ్‌ యూటర్న్‌పై బీజేపీ ఫైర్‌

Jul 8 2019 4:25 PM | Updated on Jul 8 2019 4:25 PM

BJP Slammed Anju George For Reportedly Changing Her Stand - Sakshi

బెంగళూర్‌ : అథ్లెట్‌ అంజూ జార్జ్‌ తాను బీజేపీలో చేరలేదని ప్రకటించడం పట్ల కాషాయ పార్టీ మండిపడింది. పార్టీ కర్ణాటక చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ జెండాను అందిపుచ్చుకున్న అంజూ జార్జ్‌ పార్టీలో చేరిక విషయంపై మాటమార్చడం విస్మయం కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌ ఎస్‌ శాంతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు.

బహిరంగ వేదికపై పార్టీ అధ్యక్షుడి నుంచి జెండాను అందుకోవడానికి అర్ధం ఏమిటో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే వేదికపై అంజూ జార్జ్‌ చేరికను యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారని చెప్పారు. కాగా తాను బీజేపీలో చేరలేదని అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ అథ్లెట్‌ అంజూ జార్జ్‌ వెల్లడించారని వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంట్‌ నియోజకవర్గం వారణాసిలో ఈనెల 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యుల సంఖ్యను 20 శాతం మేర పెంచాలనే లక్ష్యంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement