బీజేపీ ఉండగా ‘క్లోన్‌’ ఎందుకు?

'BJP seen as pro-Hindutva, why would anyone prefer a clone?' Jaitley's dig at Rahul - Sakshi

రాహుల్‌ దేవాలయాల సందర్శనపై జైట్లీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గుజరాత్‌లో ఎన్నికల వేళ తరచూ హిందూ దేవాలయాలు సందర్శిస్తుండటంపై కేంద్ర మంత్రి  జైట్లీ వ్యంగ్యంగా స్పందించారు. హిందుత్వ విధానాలకు బీజేపీ అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ఒరిజినల్‌’ ఉండగా ప్రజలు ‘క్లోన్‌’ను ఎందుకు కోరుకుంటారని అన్నారు. ‘బీజేపీని హిందుత్వ అనుకూల పార్టీ అని భావిస్తారు.

అసలు సిసలు హిందుత్వ పార్టీ బీజేపీ ఉండగా ప్రజలు క్లోన్‌కు ఎందుకు ప్రాధాన్యమిస్తారు?’ అని జైట్లీ శనివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. 2014లో లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని చాలాసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా అంతరించి పోతోందని  ఎద్దేవా చేశారు. నేడు భారత్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మెరుగైన ర్యాంకు సాధించిందని తెలిపారు.

వారి తప్పేంటి?: రాహుల్‌
‘రోజుకో ప్రశ్న’ పరంపరలో భాగంగా ‘ విద్యలో ప్రభుత్వ ఖర్చుకు సంబంధించి గుజరాత్‌ 26వ స్థానంలో ఎందుకు ఉంది?ఈ రాష్ట్ర యువత చేసిన తప్పేంటి?’ అని రాహుల్‌ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలను పణంగా పెట్టి మోదీ విద్యను వ్యాపారమయం చేస్తున్నారని, విద్యార్థులపై ఫీజుల భారం పెంచుతున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top