కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!

Published Fri, Jun 26 2020 5:27 AM

BJP says Rajiv Gandhi Foundation took funds from China - Sakshi

న్యూఢిల్లీ: రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. 2005–06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అం దినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాం గ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తూ ఉంటే రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రి యాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారు.  

భూములిచ్చారు, విరాళాలు తీసుకున్నారు  
2005–06లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్‌ చైనాతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్‌ ప్రశ్నించారు. ఎఫ్‌టీఏతో భారత్‌ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరందన్నారు.  

కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలు  
మధ్యప్రదేశ్‌లో జన సంవాద్‌ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలున్నాయని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. డోక్లాం వివాదం సమయంలో రాహుల్‌ చైనా వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

తప్పుదోవ పట్టిస్తున్నారా? : కాంగ్రెస్‌
లద్దాఖ్‌లోని భారత్‌ భూభాగంలోకి చైనా బలగాలు ప్రవేశించలేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. గల్వాన్‌ లోయలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు నిపుణులు చెబుతున్నారని, దీనికి సంబంధించి శాటిలైట్‌ చిత్రాలు వస్తున్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement