‘నిధులు మావి.. ప్రచారాలు మీవా’

BJP preseident kanna lakshmi narayana visits nellore district - Sakshi

సాక్షి, నెల్లూరు: జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో, శ్వేతపత్రం విడుదల చేయగలదా అని ప్రశ్నించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకునే దిక్కు లేదు.. చేనేత రంగానికి ఏదేదో చేశామని చెప్తున్నారని, అసలు రుణాలు ఎంతవరకు మాఫీ చేసారో చెప్పగలరా అని నిలదీశారు.

హౌస్ ఫర్ ఆల్ స్కీంలో కాంట్రాక్టర్లును మేపుతూ ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. నిధులు తమవి.. ప్రచారాలు మీవి.. పథకాలు మీ కార్యకర్తలకా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రభుత్వంపై ధ‍్వజమెత్తారు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ లబ్దికోసం యూటర్న్ తీసుకుని ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజి తీసుకొంటూ.. కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం సరికాదన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top