అభ్యర్థి కిడ్నాప్‌.. జెడ్పీటీసీ ఏకగ్రీవం..!

BJP Jainur ZPTC Candidate Allegations On Kova Lakshmi Unanimous - Sakshi

కొమురం భీం ఆసిఫాబాద్: తుది విడత పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా జైనూర్‌ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచి జైనూర్‌ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, కోవా లక్ష్మీ కుట్రకు పాల్పడ్డారని జైనూర్‌ బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి మైసన్‌ శేకు అతని భార్య చంద్రకళ ఆరోపించారు. ‘మా ఇద్దరినీ కిడ్నాప్‌ చేసి వేర్వేరు చోట్ల బంధించారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు’ అని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. కోవా లక్ష్మీ ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని శేకు, చంద్రకళ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జైనూర్‌ చౌరస్తాలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆసిఫాబాద్ జెడ్పీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేయడం గమనార్హం. రెండో విడత పరిషత్‌ ఎన్నికలు శుక్రవారం (మే 10) జరిగాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top