మమతకు సుప్రీంకోర్టులో ఊరట

Big Relief For Mamata Banerjee In Supreme Court On Panchayat Elections - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదంపై మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన చోట్ల తిరిగి పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30రోజుల లోపు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది మే నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలో దాదాపు 20వేల చోట్ల తృణబుల్‌ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, సీపీఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్‌ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంలో పిటిషన్లు వేశాయి. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఈ పిటిషన్లను తోసి పుచ్చింది. మళ్లీ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top