‘ఇది న్యాయవ్యవస్థకు అవినీతి అంటగట్టే ప్రయత్నమే’

Bhumana Karunakar Reddy fires on Chandrababu Naidu - Sakshi

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ను సైతం రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన భూమన.. కోర్టు నోటీసులు పంపిన క్రమంలో కేసు విచారణకు హాజరుకాకపోతే చప్రాసీకి కూడా వారంట్‌ను జారీ చేయడం సర్వ సాధారణమని, మరి అటువంటప్పుడు ఏదో కుట్ర జరిగిందని పచ్చ మాఫియా చిత్రీకరించడం సిగ్గు చేటన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌ కేసులో మహారాష్ట్ర కోర్టు నోటీసులు ఇస్తే... తనపై కుట్ర జరుగుతుందంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంత వరకూ సమంజసమన్నారు.  ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థకు అవినీతి బురద అంటగట్టే ప్రయత్నమేన్నారు. న్యాయవ్యవస్థకే కళంకం తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు.

  • పీఎం అయినా, సీఎం అయినా కోర్టు వాయిదాలకు హాజరుకాకపోతే నాన్‌బెయిల్‌బుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం సర్వ సాధారణం
  • అయితే పచ్చ మాఫియా చంద్రబాబును అల్లూరి సీతారామరాజుగా ప్రొజెక్ట్‌ చేస్తోంది
  • చంద్రబాబుపై పెట్టింది ఓ చెత్త కేసు.. ఆయనది వీరోచిత పోరాటంగా చిత్రీకరిస్తున్నారు
  • చింతమనేని రోజూ అవినీతికి పాల్పడుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు
  • నా పోరాటాన్ని అడ్డుకుంటారా అని చంద్రబాబు ప్రగల్భాలు
  • చంద‍్రబాబు నాయుడు ఓ చిటికెల రాయుడు
  • చంద్రబాబు పాలన అవినీతితో కుళ్లి కొంపు కొడుతోంది
  • 18 కేసుల్లో బెయిల్‌ తెచ్చుకున్న వీర మొనగాడు చంద్రబాబు
  • ప‍్రత్యేక హోదాపై ఉద్యమించిన వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబుది
  • సామాన్య ప్రజలని కూడా వదలని చంద్రబాబు సర్కారు
  • పుష్కరాల్లో కనీసం రూ మూడు వేల కోట్ల అవినీతి జరిగింది
  • పుష్కరాల్లో భక్తుల మృతికి చంద్రబాబే కారణం
  • కోర్టు నోటీసులు జారీ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల కుట‍్రగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు
  • నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి
  • ప్రజలన‍్నా, ప్రతిపక్షాలన్నా చంద్రబాబుకు లెక్కలేదు
  • నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతల మీద వేల కేసులు వేయించారు
  • ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, విద్యార్థులపై కేసులు పెట్టించారు
  • విజయవాడలో కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలపై ఒక్క కేసు లేదు
  • అవినీతిలో చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే నెంబర్‌వన్‌
  • దమ్ముంటే ఓటుకు కోట్లు కేసును ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడాలి
  • చంద్రబాబు ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల ప‍్రజాధనాన్ని లూటీ చేసింది
  • అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారు
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top