
సాక్షి, చిత్తూరు : పదవిలో ఉండగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ మేరకు ప్రమాణాల దేవుడుగా పేరుగాంచిన కాణిపాకం వరసిద్ది వినాయకుడి వద్ద ఆయన ప్రమాణం చేశారు.
గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని.. నేడు కాణిపాకం వర సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ‘పదవిలో ఉండగా నాపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. కానీ, అప్పుడు ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే రాజీనామా చేశాక ప్రమాణం చేస్తున్నా. నేను కానీ, నా కుటుంబంలోని వ్యక్తులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు’ అని ఆయన మీడియాకు తెలిపారు.
కాగా, గతంలో 10 వతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు కాణిపాకంలో ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు.