‘దొంగలకు పెద్దదొంగ చం‍ద్రబాబు’ | AP BJP Chief Kanna Lakshminarayana Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అవినీతిపై వంద పేజీల పుస్తకం సరిపోదు’

Oct 6 2018 1:15 PM | Updated on Oct 6 2018 1:49 PM

AP BJP Chief Kanna Lakshminarayana Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, ఏలూరు : చంద్రబాబు ఆధ్యర్యంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నిర్వహించిన  బీజేపీ ప్రజా ఆవేదన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఏపీలో దోపీడి పాలనకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహించామన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలకు కాపలా కాస్తున్న పెద్ద దొంగ చం‍ద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఆయన రాజకీయ జీవితమంతా నమ్మక ద్రోహం, మోసాలతోనే సాగిందన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, దోపీడీ గురించి వంద పేజీల పుస్తకం రాసినా సరిపోదని ఎద్దేవా చేశారు.

మోసం చేయడంలో బాబు దిట్ట
నమ్మిన వారి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని కన్నా విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో పలు కులాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రచారదాహానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది పేదలు బలి అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశానికి పట్టిన శని అని చెప్పిన చంద్రబాబు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే చం‍ద్రబాబుకి ఉలికిపాటు ఎందుకుని ప్రశ్నించారు. బాబు సీఎం కావడానికి వెన్నెముకగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన చేసిన అభివృద్ది శూన్యమన్నారు. 2019లో అభివృద్ధి కావాలో.. అవినీతికావాలో ప్రజలే తేల్చుకోవాలని కన్నా పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement