సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

AP Assembly Special Sessions TDP MLAs Suspended - Sakshi

సాక్షి, అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్‌ సందేశం ప్రజలకు చేరకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వారిని సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభా నియమాలు ఉల్లంఘించిన పలువురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్‌, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, వెంకట్‌రెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ను నేటి సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top