బీజేపీకి భారీ షాకిచ్చిన శివసేన..

Ahead Of Amit Shah Meet Uddhav Thackeray Shiv Sena Targets BJP - Sakshi

ముంబై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకి ఎన్డీయే మిత్ర పక్షం శివసేన ఊహించని షాకిచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని తేల్చి చెప్పిది. కాగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో అమిత్ షా భేటీ కానున్న కొద్ది గంటల ముందే శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు.  ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉన్నటుండి ఇప్పుడే అమిత్‌ షా ఎన్డీయే మిత్రపక్షాలతో ఎందుకు సమావేశం అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లోపరాజయంతో కంగుతిన్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలలతో భేటి అవుతున్నారని వ్యాఖ్యానించింది.
 
‘‘పాల్ఘడ్ ఉపఎన్నికల్లో శివసేన పార్టీ తన బలం నిరూపించుకుంది. దీంతో2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంపర్క్ అభియాన్ అంటూ అమిత్ షా ప్రచారం మొదలు పెట్టారు..’’ అని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల పర్యటనలో ఉంటే, అమిత్ షా దేశ పర్యటనలో ఉన్నారనీ... ఇలా బీజేపీ అంతర్జాతీయ ప్రచారం మొదలు పెట్టిందని ఎద్దేవా చేసింది.

‘‘దేశ ప్రజలతో బీజేపీకి సంబంధం తెగిపోయిందని పేర్కొంది. రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకు లాభం, ఎవరిని దూరంగా పెట్టడం మంచిదని బీజేపీ లెక్కలు వేసుకుంటుందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. మే నెలలో 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 1 లోక్‌సభ, 1 అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచిందని  గుర్తుచేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top