
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ ఎత్తివేయడమే మంచి పరిణామమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డు పెట్టుకొని టీడీపీ.. ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుందని విమర్శించారు. బుధవారం సచివాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే ఈ రోజు నిజమైందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడాన్ని కోర్టు ఆక్షేపించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు టీడీపీకి చెంపపెట్టులాంటివని దుయ్యబట్టారు. ఇకపై వైఎస్సార్సీపీ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బాగా తీసుకెళతామని, రెట్టింపు మెజారిటీతో గెలిచే అవకాశం వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీకాలే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.