మహానేతకు చిత్రాంజలి
వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన చింతలపల్లె కోటేశ్వరరావు ఇప్పటివరకు 25కిపైగా మహానేత చిత్రాలు గీశారు.
ఈ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజస్సు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది.
కోట్లాది ప్రజల హృదయాల్లో కొలువైవున్న మహా నేత వైయస్ రాజశేఖరరెడ్డి అంటే కోటేశ్వరరావుకు ఎంతో అభిమానం.
నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ‘అమ్మ ఆర్ట్ అకాడ మీ’ నిర్వహించిన పోటీల్లో కోటేశ్వరరావు గీసిన వైయస్ చిత్రాలకు జాతీయ చాంపియన్‌షిప్ అవార్డు దక్కింది.
వైయస్‌ఆర్ వర్థంతి సందర్భంగా కోటేశ్వరరావు ఘటిస్తున్న చిత్రాంజలి ఇది.