నల్లధనం ఏమైంది? | where is block money ? | Sakshi
Sakshi News home page

నల్లధనం ఏమైంది?

Mar 27 2015 4:38 AM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం ఏమైంది? - Sakshi

నల్లధనం ఏమైంది?

అధికారంలోకి రాగానే విదేశాలలో మూలుగు తున్న నల్లధనాన్ని వంద రోజులలో వెనక్కు రప్పిస్తామని బీజేపీ నాయకులు వాగ్దానం చేశా రు.

అధికారంలోకి రాగానే విదేశాలలో మూలుగు తున్న నల్లధనాన్ని వంద రోజులలో వెనక్కు రప్పిస్తామని బీజేపీ నాయకులు వాగ్దానం చేశా రు. అలా తెచ్చిన డబ్బును ఖర్చులు పోగా మిగతా సొమ్మును ప్రతీ భారతీయుని బ్యాంక్ ఖాతాలో 15 లక్షల చొప్పున వేస్తామన్నారు. ఈ మధ్య ప్రారంభించిన ‘జన్‌ధన్ యోజన’ బ్యాంకు ఖాతాలు అందుకేనే మోనని పెక్కుమంది భావించారు.

దానితో పొలోమని అన్ని కుటుంబాల వారు బ్యాంకు ఖాతాలు ప్రారంభించి 15 లక్ష లు ఎప్పుడు ఖాతాలో వేస్తారోనని ఎదురుచూ స్తున్నారు. చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణ మాఫీలా మోదీ సర్కారు ప్రజలను మోసం చేయకుండా వెంటనే నల్లధనాన్ని ప్రజల ఖాతాలలో జమ చేయాలని కోరుతున్నాను. ఇలాంటి హామీలు నెరవేర్చకపోవడం ప్రజా ద్రోహమే అవుతుంది.
- బత్తుల శేషగిరిరావు,  రాజమండ్రి

Advertisement
 
Advertisement
Advertisement