వెలుగులోకి వచ్చామనే
వెలుగులోకి వచ్చామనే
భ్రమే తప్ప ఎటు పోతున్నామో
తెలియని చీకట్లు
అలుముకున్న మాట నిజం!
నిజంగా మనం ఎటుపోతున్నాం?
బంగారు తెలంగాణ బాట
ఎప్పుడో తప్పింది
స్వచ్ఛభారత్ తీయటి నినాదంగా మారింది
అమరావతి.. అమీరులకే కానీ
మనకోసం కాదని తేలిపోయింది
మొత్తం మీద జనం
కీకారణ్యంలో చిక్కుకున్నారు
జంతువుల మధ్య రాత్రి మధ్య
భయంకర నినాదాల మధ్య
తుఫాను నిశ్శబ్దం మధ్య
ఒక చేతికి బెత్తమిస్తే
కొంత ఊరటగా ఉంటుందని
కొంత బెదిరింపు
కొంత ఆదరింపు
జాతిని కొత్త దారిలోకి నెట్టుతుందని
జనంలో ఎన్నో ఆశలు -
ప్రజాస్వామ్యంలో నియంతృత్వమెక్కడిదనే భ్రమ
సంకీర్ణంలో ప్రశ్నలేదు
జవాబు లేదని విరక్తి
ఎన్నెన్నో ఆశలు
అన్నీ ఆశలు నేలకూలి
రాళ్ల దెబ్బలు మిగిలాయి
శోకం కుప్ప మిగిలింది.
సిహెచ్. మధు
మొబైల్: 99494 86122