సాహితీ బంధువు

సాహితీ బంధువు - Sakshi


ఆ సందర్భంలోనే సూచన అందింది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు శ్రీశ్రీగారికి ఇచ్చారు. సజ్జన సాంగత్యం జీవన్ము క్తికి మార్గమవుతుందని మనసారా నమ్మి జీవించిన సాహితీ బంధువు రమణ య్య రాజాగారు. మిత్రు లందరికీ ఆయన రాజా గారు. ఆయన స్వతహాగా వ్యాపారి. 1963లో వ్యాపా రం కోసమే చెన్నై వచ్చారు. కానీ వ్యాపారంతో ఆగిపోలేదు. ఆనాటి సాహితీ ప్రియులకు తలలో నాలిక అయ్యారు. బీయస్సార్ కృష్ణ, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, నేనూ, గొల్లపూడి రామదాసు (ఇన్‌కంటాక్స్ ఆఫీసరు) ఇలా చాలా మంది ఆయన స్నేహ బృందంలో వారం. పప్పు వేణుగోపాలరావు వారి పెద్దబ్బాయి క్లాస్‌మేట్. ఆయనా ఈ బృందంలో దరిమిలాను కలిశారు.

 

 1975లో చెన్నైలో ఉంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సన్మానం చెయ్యాలని సంకల్పించారు. కానీ సన్మా నాలకి దేవులపల్లి వ్యతిరేకం. అప్పుడొక మార్గాం తరాన్ని సూచించారు పాలగుమ్మి పద్మరాజుగారు. దేవులపల్లి ‘కృష్ణపక్షం’ వెలువడి అప్పటికి 50 ఏళ్లయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కృష్ణ పక్ష స్వర్ణోత్సవం’ ఎందుకు జరపకూడదు? అంత వరకు ప్రచురించని వారి రచనలను ప్రచురిస్తూ సభని జరపాలని నిర్ణయించారు. ‘పల్లకీ’ అనే పేరుతో శాస్త్రి గారి కవితలు, ‘శర్మిష్ట’, ‘ధనుర్దాసు’ వంటి రేడియో నాటికలు, ‘మేఘమాల’ పేరిట శాస్త్రిగారి సినీమా పాటలు (ఈ పాటలు పుస్తకరూ పంగా రావడం అదే మొదటిసారి), ‘కృష్ణపక్షం’ మొదలైన ఆరు సంపుటాలు వెలువడ్డాయి. కృష్ణ పక్షం స్వర్ణోత్సవం వాణీమహల్‌లో వైభవంగా జరి గింది. ఆ సభలో నేనూ ఒక వక్తని. ఆ రుచిని మరి గిన రాజాగారికి ఆ సందర్భంలోనే సూచన అందిం ది. ఏటేటా ఒక తెలుగు ప్రముఖుడిని ఎందుకు సన్మానించరాదు? ఆ విధంగా 1979లో రాజా-లక్ష్మీ ఫౌండేషన్ ఏర్పడింది. మొదటి అవార్డు హబీబుల్లా రోడ్డులో దక్షిణ భారత కళాకారుల ఆడిటోరియంలో శ్రీశ్రీగారికి ఇచ్చారు.

 

 అచిరకాలంలో రాజాగారి అవార్డుకి ఒక గుర్తింపు, ప్రత్యేకత ఏర్పడిపోయింది. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ తమ ప్రతిభను చాటిన ఎందరో తెలుగువారిని ఈ అవార్డుతో సత్క రించారు. 1978లో ననుకుంటాను- విజయనగ రంలో రావి కొండలరావుగారి అన్నగారు ఆర్కేరావు షష్టిపూర్తి ఉత్సవాన్ని జరిపారు. ఆ ఫొటోలు నా ఆత్మకథలో ఉన్నాయి. అది చాలా పెద్ద సభ. దాశ రథి, ఆచార్య ఆత్రేయ, విద్వాన్ విశ్వం, నేనూ, బెజ వాడ గోపాలరెడ్డి - ఇలా ఎంతోమందిమో తరలి వెళ్లాం. ఆ రోజు నరాల రామిరెడ్డి అష్టావధానం నిర్వ హించారు.

 

 వ్యాపారరీత్యా విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డాక- రాజాగారి జీవితం గొప్ప మలుపు తిరిగింది. అప్ప టికే వానప్రస్థంలో పడిన ఆయన జీవితానికి చుక్కా నిలాగ సద్గురు శివానందమూర్తిగారి ఆశ్రయం లభిం చింది. ‘ఇది నా జీవితంలో దక్కిన గొప్ప అదృష్టం’ అని పొంగిపోయేవారు రాజాగారు. శివానంద మూర్తి గారి భీమిలిలోని ఆనందాశ్రమంలో ఒక ఇం టిని నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయారు. ఆయన జీవితంలో ఆ దశ అతి ప్రశాంతతని చేకూర్చిన దశ. అప్పటికే రాజాలక్షీ్ష్మ అవార్డుకి సాహితీ పురస్కా రాన్ని చేర్చారు.

 

  గురువుగారి సూచనతో ప్రతీ యేటా ఒక వేదపండితునికి వేద పురస్కారాన్ని జత చేశారు. సి. నారాయణరెడ్డి, పోణంగి శ్రీరామఅప్పారావు సాహితీ పురస్కారం, ప్రముఖ పర్యావరణ నిపుణు రాలు సునీతా నారాయణ్ - ఇంకా ఎన్నో పురస్కా రాలకు నేను వక్తను. నేదునూరి కృష్ణమూర్తిగారికి రాజాలక్ష్మీ అవార్డు ఇచ్చే సంవత్సరం నాకు ప్రత్యేక రాజాలక్ష్మీ పురస్కారం ఇచ్చారు. సద్గురువుల చేతి మీదుగా అందుకోవడం అరుదైన అదృష్టాలలో ఒకటి. ఆయన 80వ జన్మదినం సందర్భంగా డాక్టర్ జ్ఞానేశ్వర్ ఎండోమెంట్ ఫండ్‌కి అవార్డుని అందజే శారు. ఇంతేకాదు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురించారు. పప్పు వేణుగోపాలరావు ‘భజగోవిం దం’, శలాక రఘునాథశర్మ గారి ‘శివానందలహరి’, సుందరకాండ, ‘లీలాకృష్ణుడు’, ‘శ్రీమాత’ మొద లైనవి. ఆయన ఆంధ్రావిశ్వవిద్యాలయం సెనేట్ సభ్యు నిగా రెండు పర్యాయాలు, సిండికేట్ సభ్యునిగా పని చేశారు.  మొన్న- చాలా నెలల తర్వాత చెన్నై వెళ్లాను. ఆ రోజు రాజాగారిని చూడాలని నేనూ, మా ఆవిడా సంకల్పించుకున్నాం. ఉదయం నుంచీ వారి అబ్బా యిలు వెంకట్రావుకీ, కృష్ణకీ కనీసం 10 సార్లయినా ఫోన్ చేసి ఉంటాను. సమాధానం లేదు. మధ్యా హ్నం బయలుదేరే ముందు మళ్లీ చేశాను. మను మడు తీశాడు.

 

 ‘‘తాతగారు పోయారండి!’’

 తుళ్లిపడ్డాను.

 ‘‘ఎప్పుడు?’’

 ‘‘ఇవాళే!’’

‘‘మరి...మరి..’’

 ‘‘మరోగంటలో ఖననం’’

 టెలిఫోన్ పెట్టేసి పరుగెత్తాను. రాజాగారు నిద్ర పోతున్నారు. అత్యంత ప్రశాంత జీవనం గడిపి అల వోకగా సెలవు తీసుకున్న జీవన్ముక్తులు రాజాగారు.

 - గొల్లపూడి మారుతీరావు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top