గ్రహం అనుగ్రహం (28.08.2015) | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (28.08.2015)

Aug 28 2015 12:03 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం (28.08.2015) - Sakshi

గ్రహం అనుగ్రహం (28.08.2015)

గ్రహం అనుగ్రహం

గ్రహం అనుగ్రహం

శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.త్రయోదశి ఉ.6.01 వరకు
తదుపరి చతుర్దశి రా.3.10 వరకు
నక్షత్రం శ్రవణం రా.6.07 వరకు
వర్జ్యం రా.9.54 నుంచి 11.26 వరకు
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు
తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు
అమృతఘడియలు ఉ.8.10 నుంచి 9.40 వరకు
 
సూర్యోదయం:    5.48 సూర్యాస్తమయం:     6.15
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి  4.30 వరకు.

భవిష్యం
 
మేషం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఇంటా బయటా ఒత్తిడులు. దైవ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. దైవచింతన.

కన్య: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు. ధన వ్యయం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలు అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.

ధనుస్సు: బంధువులతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధన వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ చెందుతారు.

మకరం: శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

కుంభం: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు లాభాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement