గ్రహం అనుగ్రహం | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Jul 25 2015 12:58 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం

శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం, తిథి శు.నవమి రా.7.30 వరకు, నక్షత్రం స్వాతి ఉ.8.23 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ప.2.22 నుంచి 4.05 వరకు, దుర్ముహూర్తం ఉ.5.40 నుంచి 7.21 వరకు, అమృతఘడియలు రా.12.36 నుంచి 2.19 వరకు
 
సూర్యోదయం    :    5.40
సూర్యాస్తమయం    :    6.33
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం:  ప.1.30 నుంచి 3.00 వరకు.

భవిష్యం
 
మేషం: ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
 
మిథునం: కొన్ని వ్యవహారాలు మంద కొడిగా సాగుతాయి. ధన వ్యయం. వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. దైవ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
 
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. నిర్ణయాల్లో మార్పులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
 
సింహం: పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత. విందు వినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
కన్య: బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
 
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నూతన ఉద్యోగయోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లాభిస్తాయి.
 
వృశ్చికం: వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.
 
ధనుస్సు: 
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
 
మకరం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
కుంభం: కొన్ని పనులు మధ్యలో నిలిచి పోతాయి. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ నెలకొంటుంది.
 
మీనం: దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement