కేసీఆర్ ప్రధాని కావాలి

TRS NRI Cell Wishes KCR Would be Next PM - Sakshi

బహరైన్ : బహరైన్ లో జరిగిన టీఅర్ఎస్  ఎన్నారై కార్యవర్గ సమావేశంలో 2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ ప్రధాని కావాలని కోరుతూ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలామార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలు సాగాలని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ ప్రయోగశాలగా మారటం హర్షించదగ్గ విషయమన్నారు. మూస విధానాలకు స్వస్తి చెప్పడం ద్వారా తెలంగాణా దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ఈ కారణంగానే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య పోరాటాన్ని మరిపించే రీతిలో గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ విముక్తి పోరాటంలో విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.  70 ఏళ్లుగా రెండు జాతీయ పార్టీలు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించాయే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. పేదవాడు మరింత పేదవానిగా, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతున్నారే తప్ప పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే  విధానాలనే కాంగ్రెస్, బీజేపీపలు అవలంభించాయని విమర్శించారు. కేవలం 4 సంవత్సరాల వయసున్న రాష్ట్రం అన్ని వర్గాల అభివృద్ధి చేసుకంటూ అన్ని రంగాల్లో  ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశ రాజకీయాల్లో బలమైన మార్పు కోసం కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని తనదైన వ్యూహంతో, ఉద్యమంతో సుసాధ్యం చేసిన కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు తీసుకొస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్‌, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు లింబాద్రి, డా. రవి, సెక్రటరీలు రవిపటేల్, గంగాధర్, సుధాకర్, జాయింట్ సెక్రటరీలు దేవన్న, విజయ్, సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేష్, నర్సయ్య, రాజు, రాజేందర్, వెంకటేష్, సాయన్న, వసంత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top