కౌలలాంపూర్‌లో పీవీ శతజ‌యంతి ఉత్స‌వాలు

TRS Malaysia, Telangana Malaysia Association Tribute To PV Narasimha Rao - Sakshi

కౌలలాంపూర్‌: తెరాస మలేషియా, తెలంగాణ మలేషియా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘ‌నంగా జ‌రిగాయి. తెరాస కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన మంత్రి కేటీఆర్‌ సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జ‌రిగాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మలేషియా తెలంగాణ అసోసియేషన్, తెరాస మలేషియా ఆధ్వర్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ కోర్ కమిటీ సభ్యులతో కలిసి పీవీ జయంతి ఉత్సవాలను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిపారు. (నెహ్రూను మించిన ప్రధాని పీవీ)

ఈ సంద‌ర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ కలిసి ఈ వేడుకలను నిర్వహిచండి అని పిలుపునివ్వడం కేసీఆర్‌ గొప్పతనానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ పీవీ చేసిన కృషిని గుర్తించిన కేసీఆర్‌.. వారికి తగిన గుర్తింపునివ్వడం చాలా సంతోషంగా ఉందంటూ కేసీఆర్‌కు తెరాస మలేషియా తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. పీవీ శతాబ్ది జయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా నియమితులైన తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు తెరాస మలేషియా తరపున హార్ధిక‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు చిరుత, కమిటీ సభ్యులు కుర్మ మారుతి, గుండా వెంకటేశ్వర్లు, రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, దిలీప్ కపిడి, రాజేష్ తోడేటి పాల్గొన్నారు. (అచ్చమైన భారత రత్నం)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top