డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

TPAD Conducts Food Drive in Dallas - Sakshi

డాలస్ : డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఉచితంగా ఆహారాన్ని అందించడానికి ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంపై బాధ్యతతో టీపాడ్ నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 450 మంది ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అప్పుడే వండిన భోజనాన్ని అందించారు. ఉత్తర టెక్సాస్ డాలస్ ప్రాంతంలో, వేలాదిమంది నిరాశ్రయుల కుటుంబాలు ఆకలి బాధకు గురి అవుతున్నారు. చాలామంది తలదాచుకోవడానికి సొంతగూడు లేక కడుపునిండా తినడానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. టీపాడ్ తన సామాజిక బాధ్యతగా ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అండగా నిలిచి వారికి గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండేందుకు నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే రెండు వారాల వ్యవధిలో టీపాడ్ సంస్థ తీసుకొన్న రెండవ సామాజిక బాధ్యత ఈ ఫుడ్ డ్రైవ్. టీపాడ్ గత నెలలో 23వ తేదీన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కేవలం ఆహారాన్ని వండి పెట్టటమే కాకుండా, నిరాశ్రయులకు అవసరమైన, దుస్తులు, అత్యవసర వస్తువులు కూడా సమకూర్చి సహాయపడ్డారు.

టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్, వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి, జాయింట్ సెక్రటరీ లక్ష్మి పోరెడ్డి, కార్యక్రమ సమన్వయ కర్తలు, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్  గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెజరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి  కమిటీ సభ్యులు  వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల , సంతోష్ కోరె, కళ్యాణి తాడిమెట్టి , కొలాబరేషన్  కమిటీ,  వంశీ కృష్ణ , స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, నితిన్ కొర్వి, సుగాత్రి గుడూరు, మాధవి మెంట, వందన గోరు,ధనలక్ష్మి రావుల, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ యాజమాన్యం టీపాడ్ అందిస్తున్న సహాయసహకారాలను కొనియాడారు. మానవతా ధృక్పథంతో ముందడుగు వేసిన టీపాడ్ సంస్థకు తమ ధన్యవాదములు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top