ముగిసిన సింగపూర్‌ తెలంగాణ క్రికెట్‌ టోర్నీ | Singapore Telangana cricket tournament held in Sinapore | Sakshi
Sakshi News home page

ముగిసిన సింగపూర్‌ తెలంగాణ క్రికెట్‌ టోర్నీ

Aug 10 2018 12:28 PM | Updated on Jul 6 2019 12:42 PM

Singapore Telangana cricket tournament held in Sinapore - Sakshi

సింగపూర్ 53వ నేషనల్‌ డే సందర్భంగా అక్కడి తెలుగు వారందరికోసం పెద్ది శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగపూర్‌ తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు.

సింగపూర్‌ : సింగపూర్ 53వ నేషనల్‌ డే సందర్భంగా అక్కడి తెలుగు వారందరికోసం పెద్ది శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగపూర్‌ తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కొడిమ్యాల్‌ వెల్‌ విషర్స్‌, జానియక్‌ సిక్సర్స్‌ జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఫైనల్‌లో కొడిమ్యాల్‌ వెల్‌ విషర్స్ జట్టు గెలిచి టోర్నమెంట్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో విజేతలకు, రన్నర్‌గా నిలిచిన జట్టుకు పెద్ది శేఖర్ రెడ్డి బహుమతులు అందజేశారు. అలాగే సెమీ ఫైనల్‌ వరకు చేరుకున్న జట్టు సభ్యులందరికీ మెమొంటోలు అందజేశారు.

అనంతరం పెద్ది శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న వారికి, ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో సహకరించిన తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముందు ముందు సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరి కొరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఈ టోర్నమెంట్‌కి స్పాన్సర్‌ చేసిన ముద్దం బ్రదర్స్‌, కుమార్‌(ప్రొపేనెక్స్‌), వంశి(జానిక్‌), తీపి రవిందర్‌ రెడ్డి, మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement