సౌదీ, కువైట్, ఖతార్, ఒమాన్‌లలో నూతన సంవత్సర వేడుకలు నిషేధం

New Year Celebrations Ban in Gulf Countries - Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: కొత్త సంవత్సర వేడుకలపై గల్ఫ్‌ దేశాల్లో భిన్న విధానం అమలవుతోంది. పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉండే యూఏఈ, బహ్రెయిన్‌లలో నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుండగా.. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్‌లలో ఈ సంబరాలపై నిషేధం అమలవుతోంది. సౌదీ అరేబియాలో మొదటి నుంచి నిషేధం ఉంది. కువైట్‌లో 2016 నుంచి నిషేధం విధించారు. ఖతార్, ఒమాన్‌లలో కూడా నిషేధం ఉన్నప్పటికీ వలస జీవులు తమ క్యాంపులలో, ఇళ్లలో వేడుకలు జరుపుకుంటారు. యూఏఈ, బహ్రెయిన్‌లలో వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఉన్నా.. బహిరంగంగా పెద్ద శబ్దాలు వచ్చేలా సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేయడం, టపాసులు పేల్చడం లాంటివి చేయరాదు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top