మేరీల్యాండ్‌లో ఘనంగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

KLAP Conducted Tournament In Maryland  - Sakshi

మేరీల్యాండ్‌ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో కేఎల్‌ఏపీ సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబరు 26 న నిర్వహించిన వాలీబాల్‌, త్రోబాల్‌ టోర్నమెంట్‌ పోటీలు ఘనంగా జరిగాయి. పురుషులకు వాలీబాల్‌ మహిళలకు త్రోబాల్‌ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వాలీబాల్‌కు 20 జట్లు, త్రోబాల్‌కు 10 జట్లకు గాను మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 కు ప్రారంభమైన ఈ పోటీలను రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో నిర్వహించారు. ఈ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లో టాప్‌కు చేరిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటాయి.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో వాలీబాల్‌ విజేతగా న్యూయార్క్‌ స్పైకర్స్‌ నిలిచింది. రన్నరప్‌గా వాషింగ్టన్‌ కింగ్స్‌ నిలిచింది. టీమ్‌ ​​​​​​​​​​​స్ట్రైవ్‌ మూడో స్థానానికి పరిమితమయ్యింది. ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో హాజరై తమ మద్ధతును తెలిపారు. రాత్రి 9.30కి పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్‌కి సహకరించిన ఇండియన ప్యారడైజ్‌ కూషన్‌ హోటల్‌ ఎమ్‌డి జిన్‌ఓక్‌కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్పాన్సర్లు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. టోర్నమెంట్‌ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. 

​​​​​​​

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top