దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Aavirbhava dinitsvam of ysrcp at Dubai - Sakshi

దుబాయ్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌(యూఏఈ) తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు స్థానిక నాయకులు రమేశ్‌ రెడ్డి, సోమి రెడ్డి, దిలీప్‌కుమార్‌లు చెప్పారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎన్నో వ్యవప్రయాసలతో కూడుకున్నదని, ఎంతో ఓపిక ఉండాలని అది వైఎస్‌ జగన్‌కే సాధ్యమైందన్నారు. సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి నిరంతరం ప్రజాసమస్యలు తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం.. ఇంకొక 30 రోజులు కష్టపడండి.. ఆ తర్వాత జగనన్న రాజ్యం వస్తుందని అన్నారు.  రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీ ఊళ్లలో, మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే దగ్గరుండి వారికి ఓటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు. అలాగే వైఎస్‌ జగన్‌ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, మనం చేతగాని వాళ్లలా ఊరుకుంటే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఉత్సాహమున్న కార్యకర్తలు సంప్రదించాలని ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు కోరారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top