కరెంటుపై అనవసర రాద్ధాంతం: పోచారం | Unnecessary collapse on current :pocharam | Sakshi
Sakshi News home page

కరెంటుపై అనవసర రాద్ధాంతం: పోచారం

Jan 2 2018 12:33 PM | Updated on Sep 22 2018 7:53 PM

Unnecessary collapse on current :pocharam - Sakshi

నిజామాబాద్ : వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షాలు  ఎంత దుష్ప్రచారం చేసినా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు ఎంత అవసరం వుంటే అంతే వాడుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి 3 గంటల పాటు కరెంటు ఇవ్వడానికే ఆపసోపాలు పడ్డ గత ప్రభుత్వాలు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement