అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత | Z security cover for Kejriwal | Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత

Feb 10 2015 4:11 PM | Updated on May 28 2018 1:46 PM

అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత - Sakshi

అరవింద్ కేజ్రీవాల్ కు జెడ్ కేటగిరి భద్రత

ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భద్రత పెంచనున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భద్రత మరింత పెంచనున్నారు. కేజ్రీవాల్కు జెడ్ కేటగిరి భద్రతను ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ఆయన రక్షణ కోసం కనీసం 30 కమెండోలను కేటాయించనున్నటు ఓ పోలీస్ అధికారి చెప్పారు.

ఆప్ శాసనసభ పక్ష నేతగా కేజ్రీవాల్ ఎన్నికైన వెంటనే జెడ్ కేటగిరి భద్రత కల్పించనున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేస్తారు. గజియాబాద్లో నివాసం ఉంటున్న కేజ్రీవాల్కు ప్రస్తుతం 12 మంది పోలీసులు భద్రతగా ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సంచలన విజయం సాధించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో జయభేరి మోగించింది.

Advertisement
 
Advertisement
Advertisement