టార్గెట్‌ అయోధ్య : ఫైజాబాద్‌ జిల్లా పేరు మార్పు | Yogi Adityanath Renames Faizabad District As Ayodhya | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ అయోధ్య : ఫైజాబాద్‌ జిల్లా పేరు మార్పు

Nov 6 2018 6:14 PM | Updated on Nov 6 2018 6:14 PM

Yogi Adityanath Renames Faizabad District As Ayodhya - Sakshi

అయోధ్యగా మారిన ఫైజాబాద్‌ జిల్లా..

సాక్షి, లక్నో : దీపావళికి ఒక రోజు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైజాబాద్‌ జిల్లాను ఇకపై అయోధ్యగా వ్యవహరిస్తారు. అయోధ్యలో దివాళీ ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం యోగి ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మార్చుతున్నామని ప్రకటించారు. అయోధ్య మనకు గర్వకారణమని, ఈ పేరు శ్రీరాముడితో ముడిపడిందని, నేటి నుంచి ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్యగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

అయోధ్యలో త్వరలో శ్రీరాముడి పేరిట విమానాశ్రయం, దశరధుడి పేరుతో వైద్య కళాశాలను నెలకొల్పుతామని చెప్పారు. గతంలో యోగి సర్కార్‌ మొఘల్‌సరై రైల్వే జంక్షన్‌ పేరును దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు బరేలి, ఆగ్రా విమనాశ్రాయాల పేర్లను కూడా మార్చే ప్రతిపాదనలను ‍యూపీ సర్కార్‌ పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement