'యోగేంద్ర యాదవ్ లీక్ చేశారు' | Yogendra Yadav for anti-party activities | Sakshi
Sakshi News home page

'యోగేంద్ర యాదవ్ లీక్ చేశారు'

Mar 3 2015 9:30 AM | Updated on Sep 2 2017 10:14 PM

మరో రోజులో పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుండగా ఆమ్ ఆద్మీ పార్టీలో వివాదాలు తారా స్థాయినందుకున్నాయి.

కలిసికట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుతో ఊడ్చేసిన ఆప్ లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో రోజులో పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుండగా ఆ పార్టీలో వివాదాలు తారా స్థాయినందుకున్నాయి. పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేత యోగేంద్ర యాదవ్ మీడియాకు చెప్పినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అనుచరుడు దిలీప్ పాండే ఆరోపించారు. యోగేంద్ర యాదవ్ మీడియా వ్యక్తితో మాట్లాడిన మాటల రికార్డును విడుదల చేశారు. ఓ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం సదరు పత్రికా విలేకరితో బ్రేక్ ఫాస్ట్ చేసిన యాదవ్ అంతర్గతంగా ఉంచాల్సిన పార్టీ ముఖ్యమైన అంశాలను బహిర్గతం చేశాడని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement