సంచలన వ్యాఖ్యలు చేసిన యడ్యూరప్ప

Yeddyurappa Said if BJP wins 22 Lok Sabha Seats Then He Will Form Government Within 24 Hours - Sakshi

బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ గనక 22 స్థానాల్లో గెలిస్తే.. 24 గంటల్లోపే తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఓ బహిరంగ సభకు హాజరైన యడ్యూరప్ప ప్రసంగిస్తూ.. ‘నేను అహంకారంతో ఇలా మాట్లడటం లేదు. మా పార్టీ అధికారినికి దూరమై ఎంతో కాలం కావట్లేదు. కానీ ఒక వేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా పార్టీ కనక 22 స్థానాల్లో గెలిస్తే.. 24 గంటల్లోపే జేడీఎస్‌ను గద్దె దింపి రాష్టంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అధికారాన్ని హస్తగతం చేసుకుంటామ’ని తెలిపారు. అంతేకాక ఆరున్నర కోట్ల మంది కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని శపిస్తున్నారన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని తెలిపారు.

అంతేకాక ‘ఈ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాల్లో గెలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంటే కర్ణాటకలోని 28 స్థానాల్లో బీజేపీ తప్పక గెలవాలి. అందుకు తగ్గట్టు మనం కృషి చేయాలి. అది మనందరి బాధ్యత’ అంటూ కార్యకర్తలకు యడ్యూరప్ప పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సర్జికల్‌ స్ట్రైక్‌ 2 జరిగిన తర్వాత కూడా యడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మెరుపు దాడులు యువతలో ఉత్సాహాన్ని నింపాయని, దీని కారణంగా కర్ణాటకలో బీజేపీ 22 స్థానాలు గెలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : సర్జికల్‌ స్ట్రైక్స్‌-2: మేం 22 సీట్లు గెలుస్తాం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top