రాజ్‌ఘాట్‌ వద్ద స్వాతి మలివాల్‌ దీక్ష 

Women Commission Chairperson Swati Maliwal Doing Protest At Rajghat For Disha Incident - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దోషులకు తక్షణ శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన దీక్షను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కొనసాగిస్తున్నారు. మంగళవారం జంతర్‌మంతర్‌ వద్ద దీక్షను ప్రారంభించగా పోలీసులు అనుమతి లేదంటూ ఆమెను అక్కడి నుంచి తరలించారు. దీంతో స్వాతి తన ఆమరణ నిరాహార దీక్షను బుధవారం నుంచి రాజ్‌ఘాట్‌ వద్ద కొనసాగిస్తున్నారు.

ఆమె మట్లాడుతూ.. దిశ ఘటన యావత్తు దేశాన్ని షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గత మూడేళ్ల కాలంలో ఇలాంటి 55 వేల ఘటనలు ఢిల్లీ మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చాయని తెలిపారు.  దిశ ఘటనలో దోషులకు తక్షణ శిక్ష విధింపు, చట్టాల అమలు, పోలీసుల్లో బాధ్యత పెంపు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసే వరకు తన దీక్ష విరమించబోనని ఆమె తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top