క్యాబ్లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్ | Woman raped in Ola cab in Bhopal, driver arrested | Sakshi
Sakshi News home page

క్యాబ్లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్

Jan 3 2016 11:47 AM | Updated on Sep 29 2018 5:26 PM

క్యాబ్లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్ - Sakshi

క్యాబ్లో మహిళపై అత్యాచారం.. డ్రైవర్ అరెస్ట్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో క్యాబ్ డ్రైవర్.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో క్యాబ్ డ్రైవర్.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ.. ఈ నెల 29న ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ను తీసుకుంది. డ్రైవర్ దీపక్ బమానె కొంతదూరం వెళ్లాక క్యాబ్ను ఆపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను హెచ్చరించి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. జనవరి 1న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివస్తున్నాడని, అతనికి ఆమె తెలుసని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement