‘టాయిలెట్ కడితేనే వస్తా..‘ | Woman Leaves Husband's Home for Lack of Toilet in Jind | Sakshi
Sakshi News home page

‘టాయిలెట్ కడితేనే వస్తా..‘

Jul 4 2016 10:30 AM | Updated on Aug 28 2018 5:25 PM

‘టాయిలెట్ కడితేనే వస్తా..‘ - Sakshi

‘టాయిలెట్ కడితేనే వస్తా..‘

పెళ్లి రోజు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఓ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తప్పకుండా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తామని చెప్పిన అత్తమామలు ఆపని చేయకపోవడంతో తాను కాపురం చేయలేనంటూ తల్లిగారింటికి వెళ్లింది.

జింద్: పెళ్లి రోజు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఓ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తప్పకుండా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తామని చెప్పిన అత్తమామలు ఆపని చేయకపోవడంతో తాను కాపురం చేయలేనంటూ తల్లిగారింటికి వెళ్లింది. ఈ ఘటన హర్యానాలోని గౌరీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సివానా గ్రామానికి చెందిన భతేరీ అనే మహిళ గత కొద్ది రోజులుగా ఇంట్లో టాయిలెట్ నిర్మించాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ ఆమె మాటను అత్తమామలు, భర్త నిర్లక్ష్యం చేయడంతో ఓపిక నశించిన ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా తాను తన ఇంట్లోనే ఉంటున్నానని, టాయిలెట్ మహిళలకు అదనపు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఆమె చెప్పింది. కాగా, ఆమె చేసిన పనిని తండ్రి కూడా మెచ్చుకోగా అధికారులు శబాష్ అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement