నృత్యం ఆపిందని ముఖంపై కాల్చాడు..!

చిత్రకూట్: వివాహ వేడుకలో నృత్యం ఆపిందనే కోపంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో మహిళా డ్యాన్సర్ తీవ్రంగా గాయపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టిక్రా గ్రామంలో జరిగింది. నవంబర్ 30న టిక్రా గ్రామపెద్ద సుహిర్ సింగ్ పటేల్ కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బరాత్‌లో నృత్యం ఆపేశారని కోపం తెచ్చుకున్న సుహిర్ సింగ్ బంధువు ఒకరు నాటు తుపాకీతో డ్యాన్సర్లపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక డ్యాన్సర్ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి