తెలంగాణ మంత్రులతో భేటీ | Wishes to receive appointed of Ministers | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రులతో భేటీ

Jun 9 2014 10:34 PM | Updated on Aug 15 2018 9:20 PM

తెలంగాణ మంత్రులతో భేటీ - Sakshi

తెలంగాణ మంత్రులతో భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముంబై నుంచి తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది.

 వినతిపత్రం సమర్పించిన ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక
 
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముంబై నుంచి తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బృందంలోనినాయకులు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పూలబొకే అందజేసి ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. సోమవారం పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని వలస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులు, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు.
 
ఈ బృందం ఈ నెల ఏడున ముంబై నుంచి బయలుదేరింది. కేసీఆర్, మంత్రులతో భేటీ అయిన వారిలో వేదిక నాయకులు బత్తుల లింగం, ఎడ్ల సత్తయ్య, స్వామి, వీరేందర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ జేఏసీ కార్యదర్శి నల్లా రాధాకృష్ణ, సత్తిరెడ్డితోపాటు వీళ్లంతా సచివాలయం డి-బ్లాక్‌లోని మంత్రుల కార్యాలయలకు వె ళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్‌జీఓ అధ్యక్షుడు, కార్యదర్శి దేవి ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement