భర్త స్నానం చేయట్లేదని విడాకులు! | Wife Plea For Divorce For Husband Did Not Bath And Shave | Sakshi
Sakshi News home page

భర్త స్నానం చేయట్లేదని విడాకులు!

Apr 13 2019 8:29 AM | Updated on Apr 13 2019 9:12 AM

Wife Plea For Divorce For Husband Did Not Bath And Shave - Sakshi

భోపాల్‌ : ఈ మధ్య విడాకులు అడగడానికి కారణాలు కూడా ఉండట్లేదు. అడిగింది కొనివ్వడం లేదని, బయటకు తీసుకెళ్లడం లేదని.. ఇలా ఏవేవో చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తోంది వ్యవహారం. ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసినంత ఈజీగా విడాకులు కావాలని అడిగేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే.. మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

గతేడాది వివాహం చేసుకున్న ఓ జంట.. విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆర్నేళ్ల పాటు విడిగా ఉండండి..ఆ తర్వాత విడాకులు మంజూరు చేస్తామని భోపాల్‌ ఫ్యామిలీ కోర్టు తెలిపింది. ఇంతకీ విడాకులు ఎందుకు కావాలని అడిగితే.. తన భర్త గడ్డం తీసేయడం లేదని, రోజుల తరబడి స్నానం చేయడం లేదని.. ఏదైనా అంటే పర్‌ఫ్యూమ్‌ కొట్టుకుంటాడనే కారణాలను చెప్పింది. ఇద్దరు కలిసి కోర్టును ఆశ్రయించగా.. పైవిధంగా తీర్పునిచ్చింది. గతంలో మీరట్‌కు చెందిన ఓ గృహిణి కూడా ఇలాగే.. గడ్డం తీసేస్తావా లేదంటే ఆత్మహత్య చేసుకోవాలా? అని తన భర్తను బెదిరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement