హమ్మయ్య! ఇక ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు! | WHO reassures on health impact of mobile phones | Sakshi
Sakshi News home page

హమ్మయ్య! ఇక ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు!

Nov 9 2014 11:50 PM | Updated on Sep 2 2017 4:09 PM

హమ్మయ్య! ఇక ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు!

హమ్మయ్య! ఇక ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు!

మొబైల్ ఫోన్ల రేడియేషన్ వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి స్పష్టంచేసింది.

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల రేడియేషన్ వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి స్పష్టంచేసింది.  ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాల ప్రకారం.. సెల్‌ఫోన్ల నుంచి ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదికలో వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ వస్తుందంటూ అనేక దేశాలలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భయాలను దూరం చేసేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా సెల్‌ఫోన్ల వాడటం వల్ల మనిషి శరీరంపై తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతున్నట్లుగా తమ అధ్యయనంలో  వెల్లడికాలేదని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 690 కోట్ల మొబైల్‌ఫోన్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మొబైల్ రేడియేషన్ వల్ల శరీర కణజాలం వేడెక్కుతున్నా, మెదడు, ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు కలిగించేంత స్థాయిలో రేడియేషన్ ఫ్రీక్వెన్సీలు ఉండవని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. మెదడు, గుండె పనితీరు, నిద్ర, బీపీ వంటివాటిపైనా ఎలాంటి దుష్ర్పభావాలు కలగడం లేదని స్పష్టంచేసింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement