కీలక రంగాలకు సడలింపు ఇచ్చిన మమత | West Bengal CM Mamata Banerjee Gave Green Signal To Earning Activities | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో మరికొన్ని రంగాలకు సడలింపు..

Apr 16 2020 3:10 PM | Updated on Apr 16 2020 3:59 PM

West Bengal CM Mamata Banerjee Gave Green Signal To Earning Activities - Sakshi

కోల్‌కత్తా:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని దినసరి కూలీలకు, కార్మికులకు జీవనోపాధికి వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినట్లు ప్రకటించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. మేమూ కొన్ని అదనపు కార్యకలాపాలను కూడా అనుమతిస్తున్నాము. కార్మికులు విధుల్లో సరైన శానిటైజేషన్ సదుపాయాలు, మాస్క్‌లు ధరించటంతో పాటు సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం వంటి నిబంధనలు ఆయా శాఖలు పాటించడం తప్పనిసరి’ అని మమత తెలిపారు. కాగా ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురువారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

హాట్‌స్పాట్‌ సడలింపులు వీటికి వర్తించవు...
కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాతో బెంగాల్‌కు చెందిన 4 జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో జనప నార మిల్లులు ఎక్కువగా ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన సడలింపులు ఈ జిల్లాలకు వర్తించవు అని సీఎం మమత తెలిపారు. ఈ మార్గదర్శకాలు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా ఉపయోగపడతాయని తామే ఆశిస్తున్నట్లు మమతా చెప్పారు. ఇక సెప్టెంబర్‌ నెల వరకు రాష్ట్రంలోని దాదాపు ఏడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత రేషన్‌ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల గ్రామీణ ప్రజలకు కొంత జీవనోపాధి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. (లాక్‌డౌన్‌ సడలించే రంగాలు ఇవే..)

100 రోజు ఉపాధి హామీ పథకం కార్మికులు కూడా ఈ ప్రాజెక్టుల్లో నిమగ్నమవ్వోచ్చు..
​‍నీటిపారుదల, రహదారి నిర్మాణం, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్‌, సివిల్ నిర్మాణానికి సంబంధించిన చిన్న ప్రాజెక్టుల నిర్మాణం స్థానిక కార్మికులతో అనుమతించబడతాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులకు వెసులు బాటు కల్పించింది. ప్రాజెక్టులు చేపట్టే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోజులలో కార్మికులకు పని లభించేలా చూడటానికి ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక యంత్రాంగం రూపొందించబడుతుంది అని మమతా చెప్పారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో, పారిశ్రామిక సమూహాలు లేదా ఎస్టేట్ల వద్ద పరిశ్రమలను, యూనిట్లను నడపాలనుకునే వారు, ప్రధాన కార్యదర్శికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని మమతా పేర్కొన్నారు.

బెంగాల్‌లో అనుమతించబడే ఆర్థిక రంగాలు ఇవే:

  • ​‍టీ ప్రాసెసింగ్.. ఇది 25 శాతం శ్రామిక శక్తితో అనుమతించబడుతుంది.  
  • ​‍​‍రబీ పంట కోతలో 100 వంద రోజుల పని పథక కార్మికులకు అనుమతి
  • గిడ్డంగులు రబీ పంట కోతకు ప్రత్యక్ష సంబంధం కలిగిన పనునలు
  • ఇటుక బట్టీలో 15 శాతంతో కార్మికులలో రోజు పనిచేయడానికి అనుమతి
  • గ్రామీణ ఉద్యోగ పథకాల ప్రాజెక్టులైన భూ అభివృద్ధి, నీటి సేకరణ, నర్సరీలకు సంబంధిత పనులు
  • జనపనార మిల్లులు, 15 శాతం శ్రామిక శక్తితో పనిచేయడానికి అనుమతి

కాగా రోజు రోజుకు దేశంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తున్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డ్‌న్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే దినసరి కూలీలు, వలస కూలీల, కార్మికుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. అంతేగాక దేశ ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని అత్యవసర రంగాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనలతో కూడిన సడలింపులు విధిస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. (మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement