ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం తేదలచిన బిల్లులను సభలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం తేదలచిన బిల్లులను సభలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో మార్పులను అంగీకరించబోమంది. ‘ఆర్డినెన్సులతో చట్టాలను మార్చాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని అడ్డుకుంటాం. ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఆ బిల్లులను అడ్డుకుంటాం’ అని పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ శుక్రవారం పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ అనుసరించబోయే వైఖరిని అహ్మద్ పటేల్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ‘పేదల కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు, విధానాలను నీరుగార్చి.. ఇప్పుడు సభలో కాంగ్రెస్ మద్ధతు కోరుకోవడం మోదీ ప్రభుత్వ వైపరీత్యానికి నిదర్శనం’ అంటూ పార్టీ చీఫ్ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు.