
వారిని వెనక్కి పంపించకుండా చర్యలు
అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థులను తిరిగి పంపించకుండా చూసేందుకు ఆ దేశ అధికారులతో భారత దౌత్య కార్యాలయ అధికారులు చర్చలు జరుపుతున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థులను తిరిగి పంపించకుండా చూసేందుకు ఆ దేశ అధికారులతో భారత దౌత్య కార్యాలయ అధికారులు చర్చలు జరుపుతున్నారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు రాసిన లేఖకు బదులిస్తూ అమెరికాలోని విమానాశ్రయాల్లో తెలుగు విద్యార్థుల పట్ల అధికారులు ప్రవర్తించిన ఘటనలపై అధికారులు విచారం వ్యక్తం చేశారన్నారు. అక్కడ చదువుకోవాలనుకునే విద్యార్థులు తాము చేరబోయే విద్యా సంస్థల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలన్నారు. సరైన డాక్యుమెంట్లు ఉన్నవారిని వెనక్కి పంపినట్లయితే అమెరికా అధికారులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.