‘కోపమొచ్చింది.. ఓడాం.. ఇదేం ట్రైలరా?’ | 'We lost due to anger over candidate,' says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

‘కోపమొచ్చింది.. ఓడాం.. ఇదేం ట్రైలరా?’

Apr 14 2017 6:06 PM | Updated on Aug 20 2018 3:46 PM

‘కోపమొచ్చింది.. ఓడాం.. ఇదేం ట్రైలరా?’ - Sakshi

‘కోపమొచ్చింది.. ఓడాం.. ఇదేం ట్రైలరా?’

ఢిల్లీ ఉప ఎన్నికల్లో ఓటమిపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు నిరుత్సాహపడటం వల్లే ఫలితం అలా వచ్చిందని అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ఎన్నికల్లో ఓటమిపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు నిరుత్సాహపడటం వల్లే ఫలితం అలా వచ్చిందని అన్నారు. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జర్నేయిల్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసి పార్టీ తరుపున పంజాబ్‌ ఎన్నికల్లో బరిలోకి దిగారని అది ప్రజలకు నచ్చలేదని, తీవ్ర నిరుత్సాహంతో వారు తమకు ఓటమి అందించారని తెలిపారు.

అయితే, ఇదేమీ ట్రైలర్‌గా భావించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్‌ చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలపై దీని ప్రభావం ఉండబోదని అన్నారు. రెండు వేర్వేరు ఎన్నికలని చెప్పుకొచ్చారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో స్థానంలో కాంగ్రెస్‌పార్టీ నిలిచింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement