
సాక్షి,ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెదిరింపు లేఖ కలకలం రేపింది. 2018 జనవరి 26న దాడి చేస్తామంటూ ఐఎస్‌ఎస్ హెచ్చరించిన లేఖ కార్గో విమానంలో వెలుగు చూసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్న విమానాశ్రయం పీఆర్‌వో వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ బెదిరింపు లేఖ అంశాన్ని ఎఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
ముంబై విమానాశ్రయంలో కార్గో విమానం బాత్ రూంలో బుధవారం ఈ వార్నింగ్ లెటర్ దర్శనమిచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. పోలీసులు, సీఐఎస్‌ఎప్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే ప్రవేశానికి అనుమతినిస్తున్నారు.