ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం | Virbhadra Singh said no idea on how to make assets in the name of wife and children | Sakshi
Sakshi News home page

ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం

Jun 9 2016 5:58 PM | Updated on Sep 4 2017 2:05 AM

ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం

ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదు: సీఎం

అక్రమ ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

సిమ్లా: అక్రమ ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్య, పిల్లల పేరుతో ఆయన కూడబెట్టిన అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ గట్టి ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులు, భాగస్వాములు కుట్రలు చేసి ఏవిధంగా ఆస్తులు సంపాదించారనే దానిపై సీబీఐ వద్ద సాక్ష్యాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వీరభద్ర సింగ్ ను గురువారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించాననో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నవారందిరినీ త్వరలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement